Gautam Gambhir: గంభీర్ ఎమోషనల్ కోచ్.. అలాంటి వాళ్ళు జట్టుతో ఉండకూడదు: డివిలియర్స్ హాట్ కామెంట్స్

Gautam Gambhir:  గంభీర్ ఎమోషనల్ కోచ్.. అలాంటి వాళ్ళు జట్టుతో ఉండకూడదు: డివిలియర్స్ హాట్ కామెంట్స్

టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ అడుగుపెట్టినప్పటి దగ్గర నుంచి భారత జట్టు టెస్టుల్లో విజయాల కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. వైట్ బాల్ ఫార్మాట్ లో అదరగొట్టినా.. టెస్టుల్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతుంది. తాజాగా సౌతాఫ్రికాతో ముగిసిన రెండో టెస్టులో ఓటమి తర్వాత టీమిండియా 0-2 తేడాతో సిరీస్ కోల్పోయింది. ఇప్పటివరకు గంభీర్ కోచ్ గా భారత జట్టు ఆరు టెస్ట్ సిరీస్ లు ఆడింది. వీటిలో రెండు గెలిచి మూడు ఓడిపోయింది. ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ సమమైంది. గెలిచిన రెండు సిరీస్ లు కూడా బలహీనమైన బంగ్లాదేశ్, వెస్టిండీస్ లపై కావడంతో గంభీర్ హెడ్ కోచ్ గా ఇప్పటివరకు విఫలమయ్యాడనే చెప్పాలి.

ఇప్పటివరకు హెడ్ కోచ్ గా టీమిండియాకు టెస్టుల్లో విజయాలను అందించడంలో గంభీర్ పెద్దగా సక్సెస్ కాలేదు. ముఖ్యంగా గౌహతి వేదికగా బుధవారం (నవంబర్ 26) జరిగిన రెండో టెస్టులో సౌతాఫ్రికా చేతిలో టీమిండియా 408 పరుగుల తేడాతో ఘోరంగా ఓడిపోవడంతో టీమిండియా టెస్ట్ భవిష్యత్ డైలమాలో పడింది. దీంతో భారత జట్టు కోచ్ గా తొలగించాలనే డిమాండ్స్ వినిపించాయి. అయితే బీసీసీఐ మాత్రం గంభీర్ ను తొలగించే ఆలోచన లేదని స్పష్టం చేసింది. స్వదేశంలో సౌతాఫ్రికాపై సిరీస్ ఓటమితో ఆ దేశ లెజెండరీ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ సంచలన కామెంట్స్ చేశాడు. గంభీర్ ను ఎమోషనల్ కోచ్ అని చెప్పడం వైరల్ గా మారుతోంది.      

ALSO READ : బంగ్లాదేశ్‌తో సిరీస్ రద్దు..

భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో తన యూట్యూబ్ ఛానెల్‌లో డివిలియర్స్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. "భారత జట్టు గురించి మాట్లాడడం చాలా కష్టంగా ఉంది. నాయకత్వం విషయానికి వస్తే గౌతమ్ గంభీర్ ఎలా ఉంటాడో నాకు తెలియదు. నేను అతన్ని ఒక ఎమోషనల్ ప్లేయర్ గానే చూశాను. అతను నాకు ఎమోషనల్ ప్లేయర్ గా తెలుసు. సాధారణంగా డ్రెస్సింగ్ రూమ్ లో ఎమోషనల్ కోచ్ ఉండడం మంచిది కాదు. గంభీర్ తెర వెనుక ఎలాంటి కోచ్ అనే విషయం నాకు తెలియదు. కొంతమంది ఆటగాళ్ళు మాజీ ఆటగాడిగా కోచ్ గా వచ్చినప్పుడు సౌకర్యంగా ఉంటారు. మరికొందరు ముందు ఎప్పుడూ ఆడని కోచ్‌తో సౌకర్యంగా ఉంటారు సుఖంగా ఉంటారు". అని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. 

సిరీస్ ఓటమి తర్వాత గంభీర్ కామెంట్స్:
 
"నా విషయంలో బీసీసీఐ నిర్ణయం తీసుకోవాలి. ఇండియా క్రికెట్‌‌ ముఖ్యం, నేను కాదని కోచ్‌‌గా బాధ్యతలు తీసుకున్నప్పుడే చెప్పా. ఇప్పుడు కూడా అదే మాట చెబుతున్నా. ప్రజలు విజయాలను చాలా త్వరగా మర్చిపోతారు. ఎందుకంటే ఇంగ్లండ్‌‌లో యువ జట్టుతో ఫలితాలు సాధించిన వ్యక్తిని నేనేనన్న విషయం మర్చిపోయి కివీస్‌‌ చేతిలో వైట్‌‌వాష్‌‌ను గుర్తు పెట్టుకున్నారు. నేను చాంపియన్స్‌‌, ఆసియా ట్రోఫీని కూడా గెలిచిన వ్యక్తిని". అని గౌతీ గుర్తు చేశాడు.