MS Dhoni: సౌత్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న MI vs CSK హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు మహేంద్ర సింగ్ ధోనీ సందడి చేశారు. గాయం కారణంగా ఐపీఎల్ 2026లో ఇప్పటి వరకు ఆడని ధోనీ, ఈ మ్యాచ్‌తో రీ-ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉండటంతో అందరి దృష్టి అతడిపైనే ఉంది.
ఇక చాలు బ్రో.. ఇంటికి వెళ్లనివ్వు!:
ప్రాక్టీస్ ముగించుకుని నెట్స్ నుంచి బయటకు వస్తున్న ధోనీని కెమెరామెన్ వదలకుండా వెంబడించడంతో ధోనీ తనదైన శైలిలో సరదాగా స్పందించారు. "భాయ్, ఇక వదిలేయ్.. రీల్ అంతా నిండిపోయింది. నన్ను ఇంటికి వెళ్లనివ్వు" అంటూ నవ్వుతూ కెమెరామెన్‌ను ఉద్దేశించి హిందీలో అనడం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
దీపక్ చాహర్‌తో ఎమోషనల్ మూమెంట్:
ప్రస్తుతం ముంబై ఇండియన్స్ (MI) జట్టులో ఉన్న దీపక్ చాహర్, తన పాత కెప్టెన్ ధోనీని కలిశారు. చాహర్ రాగానే.. "నువ్వు కెమెరాను కూడా వెంట తెచ్చావా?" అని మహేంద్ర సింగ్ ధోనీ సరదాగా అనడంతో.. చాహర్ వెంటనే ధోనీ పాదాలకు నమస్కారం చేసి తన గౌరవాన్ని చాటుకున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న బంధం చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.
Also Read : బెంగళూరులో కోహ్లీ బ్రాండ్ హోటల్ వన్8 కమ్యూన్ క్లోజ్
ధోనీ రీ-ఎంట్రీ అప్పుడే?:
హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన మొదటి ఆరు మ్యాచ్‌లకు ఎంఎస్ ధోనీ దూరమయ్యారు. ఏప్రిల్ 23 (గురువారం) న ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో ధోనీ బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే స్టేడియంలో ధోనీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు చూస్తుంటే, ముంబైతో పోరులో 'తలా' మెరుపులు చూడవచ్చని సీఎస్కే ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
“Bhai reel bhar gaya, pura bhar gya ab, ab meri battery bhi 1% pe hai, Ghar jaane de chhod de ab” 🤣
— Shariq (@CricBhakt7380) April 22, 2026
————: MS Dhoni to IPL cameraman pic.twitter.com/9OJHo51apf

