ఇంజనీరింగ్ విద్యార్థి అదృశ్యం.. కాలేజ్‌ ముందు ఉద్రిక్తత

ఇంజనీరింగ్ విద్యార్థి అదృశ్యం.. కాలేజ్‌ ముందు ఉద్రిక్తత

హైదరాబాద్ అబ్ధుల్లాపూర్‌మెట్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజ్‌పై విద్యార్ధులు, విద్యార్ధి సంఘాల నేతలు దాడికి దిగారు. కాలేజీలో చదువుకుంటున్న ఆంజనేయులు అనే విద్యార్ధి అదృశ్యానికి కాలేజ్ యాజమాన్యమే కారణమని వారు ఆరోపిస్తున్నారు. ఆగస్టు 20 తేదీన ఆంజనేయులు కాలేజ్ హాస్టల్ నుంచి కనపడకుండా పోయాడు. హాస్టల్ వార్డెన్ వద్ద 500 తీసుకొని ఆంజనేయులు బయటకు వెళ్లాడని తోటి విద్యార్థులు తెలిపారు. 

ఆంజనేయులుకు అతని తల్లిదండ్రులు ఫోన్ చేయడంతో.. ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందనే అనుమానంతో తల్లిదండ్రులు కాలేజీ వద్దకు చేరుకున్నారు. ఆంజనేయులు ఎక్కడని కాలేజీ యాజమాన్యాన్ని అడగ్గా.. మాకేం తెలుసని యాజమాన్యం నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. 

ఈ క్రమంలో ఆగస్టు 26 శనివారం ఆంజనేయులు తల్లింద్రులతో పాటు విద్యార్థి సంఘాలు కాలేజీ వద్దకు భారీగా చేరుకుని ఆందోళన చేపట్టారు. కాలేజ్ లోపలికి చొచ్చుకొని వెళ్లి.. కాళాశాలలో ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కాలేజ్ వద్దకు చేరుకుని విద్యార్ధులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.