సంప్రదాయ దుస్తుల్లో నోబెల్ అవార్డును అందుకున్నారు

సంప్రదాయ దుస్తుల్లో నోబెల్ అవార్డును అందుకున్నారు

భారతదేశ గొప్పదనాన్ని విశ్వవ్యాప్తంగా చాటి చెప్పారు అభిజిత్‌ బెనర్జీ. ఎకనామిక్స్ లో నోబెల్‌ అవార్డును స్వీడన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఆ దేశ రాజు గుస్టాఫ్‌ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. పేదరికం నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించేందుకు తన రిసెర్చ్ ద్వారా అద్భుత పరిష్కారాలను సూచించినందుకుగానూ అభిజిత్‌ బెనర్జీ సహా ఆయన భార్య ఎస్తర్‌ డుఫ్లో, మరో ఆర్థికవేత్త అయిన మైఖెల్‌ క్రెమర్‌కు కూడా ఈ నోబెల్‌ అవార్డు లభించింది. స్వీడన్‌లో వైభవంగా జరిగిన నోబెల్‌ అవార్డుల ప్రదానోత్సవానికి అభిజిత్‌ బెనర్జీ, ఆయన భార్య ఎస్తర్‌ డుఫ్లో భారత సాంప్రదాయ దుస్తుల్లో హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. ధోతీ, బంద్‌గలా సూట్‌లో అభిజిత్‌, చీరకట్టు, బొట్టుతో వచ్చిన ఎస్తర్‌ మన సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పారు. అవార్డు అందుకున్న తర్వాత వేడుకకు హాజరైన వారందరికీ నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.