అబిడ్స్ వ్యభిచారం కేసులో.. రాంనగర్ అఖిల్ పహిల్వాన్ అరెస్ట్

అబిడ్స్ వ్యభిచారం కేసులో..  రాంనగర్ అఖిల్ పహిల్వాన్ అరెస్ట్
  • 16 మంది కోల్‌‌ కతా యువతులతో వ్యభిచారం
  • ఓనర్, మేనేజర్లతో పాటు నలుగురు కస్టమర్ల రిమాండ్

బషీర్ బాగ్, వెలుగు:  హైదరాబాద్ లోని ఓ లాడ్జిలో వ్యభిచారానికి సంబంధించిన కేసులో లాడ్జి ఓనర్‌‌‌‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్‌‌కతా నుంచి రప్పించిన 16  మంది అమ్మాయిలతో అబిడ్స్‌‌లోని లోంజ్ ఫార్చ్యూన్ లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లుగా సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ టీంకు బుధవారం సమాచారం అందడంతో అబిడ్స్‌‌ పోలీసులతో కలిసి ఆకస్మిక దాడులు చేశారు.  ఈ దాడుల్లో 16 మంది యువతులు, ఆరుగురు కస్టమర్లు, ఇద్దరు ఆర్గనైజర్లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

లాడ్జి మేనేజర్ రఘుపతితో పాటు కస్టమర్లు అభిషేక్ భాటి, కేశవ్ వ్యాస్, అబ్దుల్ ఖాలీద్, సంతోష్ లను అరెస్ట్ చేశారు. వీరి వద్ద ఉన్న సెల్ ఫోన్స్, రికార్డులను సీజ్ చేసి, లాడ్జికి తాళం వేశారు. లాడ్జి ఓనర్ అఖిలేష్ అలియాస్ రాంనగర్ అఖిల్ పహిల్వాన్ ను శుక్రవారం రాత్రి అరెస్ట్ చేసి, శనివారం రిమాండ్ కు తరలించారు. కోల్‌‌కతాకు చెందిన యువతులను హోమ్ కు తరలించినట్లు  అబిడ్స్ సీఐ నరసింహ రాజు తెలిపారు.  ఈ వ్యవహారానికి సంబంధించి అఖిల్ పహిల్వాన్ ఫోన్ డేటాను, కాల్ డేటాను పరిశీలిస్తున్నామని చెప్పారు. అతడికి జాతీయ, అంతర్జాతీయ వ్యభిచార ముఠాతో సంబంధాలపైనా దర్యాప్తు చేస్తున్నామన్నారు.