ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన ఏబీవీపీ కార్యకర్తలు

ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన ఏబీవీపీ కార్యకర్తలు

ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. TSPSC  పేపర్ లీకేజీ ఘటన పై ఏబీవీపీ అధ్వర్యంలో కార్యకర్తలు ముట్టడికి యత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు,ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో ప్రగతి భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఏబీవీపీ కార్యకర్తలపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. 

టీఎస్ పీఏసీ పేపర్ లీకేజీ ఘటనపై సీయం కేసీఆర్ స్పందించాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు,నిరుద్యోగులకు జీవితాలతో చెలగాటం ఆడుతుందని అన్నారు. టీఎస్ పీఎస్ సి చైర్మన్,కార్యదర్శులను వెంటనే  బర్తరఫ్ చేయాలని,  సీఎం  కేసిఆర్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ ఘటన పై సిట్టింగ్ జడ్జితో విచారణ  చేయాలని,  సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.