కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు

కేటీఆర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు

నారాయణపేట జిల్లాలో కేటీఆర్ పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులేర్పడ్డాయి. జిల్లా పర్యటనకు వచ్చిన కేటీఆర్ కాన్వాయ్‌ను ABVP కార్యకర్తలు అడ్డుకున్నారు. జెండాలు పట్టుకుని కేటీఆర్ కాన్వాయ్‌కు అడ్డుగా వెళ్లారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. దాంతో  పోలీసులు విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేశారు.

మరోవైపు కేటీఆర్ టూర్‌తో నారాయణపేటలో తెల్లవారుజాము నుంచే బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. తాము ఎలాంటి ఆందోళన కార్యక్రమాలకు పిలుపు ఇవ్వకున్నా అరెస్ట్ చేయడం ఏంటని.. బీజేపీ లీడర్లు ఫైర్ అవుతున్నారు. పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా పని చేస్తున్నారని మండిపడ్డారు. 

మంత్రి కేటీఆర్ ఈ రోజు నారాయణపేటలో పర్యటిస్తున్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. సైన్స్ పార్క్, చిల్డ్రన్ పార్క్, జిల్లా ఆస్పత్రిలో చిన్న పిల్లల వైద్యం కోసం ఏర్పాటు చేసిన ఐసీయూ వార్డును కేటీఆర్ ప్రారంభించనున్నారు. టెక్స్ టైల్ పార్క్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనం, అమరవీరుల స్థూపం నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు.