ఇవాళ స్కూళ్ల బంద్​కు ఏబీవీపీ పిలుపు

ఇవాళ స్కూళ్ల బంద్​కు ఏబీవీపీ పిలుపు

ఖైరతాబాద్, వెలుగు: విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న తమ లీడర్లపై పోలీసుల లాఠీచార్జ్​ను​ నిరసిస్తూ మంగళవారం రాష్ర్టంలో స్కూల్స్​ బంద్​కు ఏబీవీపీ పిలుపు నిచ్చింది. సోమవారం సోమాజీగూడ ప్రెస్​క్లబ్​లో  మీడియాతో ఏబీవీపీ నేతలు మాట్లాడారు. విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించాలంటూ 2న నాంపల్లిలోని ఎడ్యుకేషన్ బోర్డ్ వద్ద నిరసన తెలిపిన తమ లీడర్లపై పెట్టిన కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులతో తమ కార్యకర్తలు దురుసుగా ప్రవర్తించలేద న్నారు. రాష్ట్ర సర్కార్​ కుట్ర పూరితంగా కేసులు పెట్టి వేధిస్తోందని, అరెస్టు చేసిన తమ లీడర్లను విడుదల చేయాలన్నారు. స్కూల్స్​ ప్రారంభమై నెలవుతున్నా బుక్స్​ పంపిణీ జరగలేదన్నారు. ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఝాన్సీ, లీడర్లు శ్రీశైలం, కమల్ సురేష్, అరవింద్, సిరి వెన్నెల పాల్గొన్నారు.