బాలకృష్ణ భాగోతాలు..45 పేజీల రిమాండ్ రిపోర్టు..బినామీల పేరుతో వందల కోట్లు!

 బాలకృష్ణ భాగోతాలు..45 పేజీల రిమాండ్ రిపోర్టు..బినామీల పేరుతో వందల కోట్లు!

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్  శివ బాలకృష్ణ అవినీతి డొంక కదులుతోంది. లేటెస్ట్ గా శివ  బాలకృష్ణపై ఏసీబీ 45 పేజీల రిమాండ్ రిపోర్టు రెడీ చేసింది. వీటిలో  కీలక విషయాలు వెల్లడించింది. శివబాలకృష్ణ ఇల్లు సహా 18 చోట్ల సోదాలు చేసిన  ఏసీబీ..  భారీగా స్థిర, చరాస్తులకు సంబంధించిన కీలక ఫైల్స్ స్వాధీనం చేసుకుంది.  వీటి విలువ  డాక్యుమెంట్ల ప్రకారం దాదాపు రూ. 5 కోట్లు ఉండగా.. బహిరంగ మార్కెట్లో 10 రెట్లు ఎక్కువగా ఉంటుందని గుర్తించారు.  వీటితో పాటు 99లక్షల నగదు, నాలుగు కార్లు, రూ.8 కోట్లకు పైగా విలువైన  గోల్డ్, సిల్వర్, వాచ్ లు, ఫోన్స్, గృహోపకరణాలు సీజ్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు అధికారులు

పలు ఇన్ ఫ్రా కంపెనీలపై ఏసీబీ సోదాలు చేసింది. 155 డాక్యుమెంట్స్ షీట్స్,  20 ఎల్ ఐసీ బాండ్స్, ఐటీ రిటర్న్స్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసకుంది.  4  బ్యాంకు పాసుబుక్కులు  స్వాధీనం చేసుకుంది. ఇందుకు సంబంధించిన బినామీలను విచారించాల్సి ఉంది. ఇతర అధికారుల పాత్రపై దర్యాప్తు జరపాల్సి ఉంది. ఫిర్జాదిగూడలో పెంట రమాదేవి, మైహోం భూజాలో కిరణ్ ఆచార్య, జూబ్లీహిల్స్ లో ప్రమోద్ కుమార్, మాదాపూర్ లో కొమ్మిడి సందీప్ రెడ్డి, బాచుపల్లిలో సత్యనారాయణ మూర్తి నివాసాల్లో సహా 18చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. 

ఇప్పటికే అరెస్టయిన శివ బాలకృష్ణ చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఏసీబీ కోర్టు ఆయనకు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. అయితే బాలకృష్ణను కస్టడీలోకి తీసుకోవాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసింది. ఏసీబీ వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరుతోంది. కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని భావిస్తోంది.