- ఏసీబీకి చిక్కిన హుజూరాబాద్ డిప్యూటీ జైలర్, జైల్ పెట్రోల్ బంక్ ఆపరేటర్
హుజురాబాద్, వెలుగు : ఓ రిమాండ్ ఖైదీకి సదుపాయాలు కల్పించేందుకు లంచం తీసుకున్న హుజూరాబాద్ సబ్ జైలు డిప్యూటీ జైలర్, జైల్ పెట్రోల్ బంక్ ఆపరేటర్ ను ఏసీబీ ఆఫీసర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ ఆఫీసర్లు తెలిపిన వివరాల ప్రకారం... హుజురాబాద్ సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఓ వ్యక్తికి మెరుగైన వసతులు కల్పించడం, ములాఖత్ కు అనుమతించడం, ఖమ్మం జైలుకు బదిలీ కాకుండా చూసుకునేందుకు డిప్యూటీ జైలర్ నాంపల్లి దేవేందర్ రూ. 10 వేలు డిమాండ్ చేశారు.
దీంతో సదరు రిమాండ్ ఖైదీ కుటుంబ సభ్యులు ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. వారి సూచన మేరకు డబ్బులు ఇచ్చేందుకు డిప్యూటీ జైలర్ కు సమాచారం ఇచ్చాడు. ఆయన సూచన మేరకు సోమవారం సాయంత్రం సబ్ జైల్ పెట్రోల్ బంక్ ఆపరేటర్ రావుల హరీశ్ ను కలిసి రూ. 10 వేలు ఇచ్చారు. అతడి నుంచి డిప్యూటీ జైలర్ దేవేందర్ డబ్బులు తీసుకుంటుండగా.. ఏసీబీ ఆఫీసర్లు దాడి చేసి పట్టుకున్నారు. దేవేందర్, హరీశ్ ను అదుపులోకి తీసుకొని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆఫీసర్లు వెల్లడించారు.
