పంజాగుట్ట, వెలుగు: సర్వీస్రికార్డులను ఉన్నతాధికారులకు పంపేందుకు రూ. 20 వేల లంచం డిమాండ్ చేసి, ఓ ప్రభుత్వ ఉద్యోగి ఏసీబీకి చిక్కాడు. అమీర్‌పేట ప్రభుత్వ పాఠశాలలో గతంలో పనిచేసిన ఓ మహిళ ఉద్యోగి సర్వీస్ రికార్డులను డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్స్కూల్స్కార్యాలయానికి పంపాల్సి ఉంది. ఈ పని కోసం ఆమె కొడుకు రాగా, అక్కడ రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సీహెచ్. శివానంద్ అందుకు రూ. 20 వేలు లంచం డిమాండ్ చేశాడు.
లంచం ఇవ్వడం ఇష్టం లేని అతను ఏసీబీని ఆశ్రయించగా, అధికారులు పక్కా స్కెచ్ వేశారు. సోమవారం సాయంత్రం స్కూల్ సమీపంలోని ఓ జ్యూస్ సెంటర్లో బాధితుడి నుంచి శివానంద్ లంచం డబ్బులు తీసుకుని జేబులో పెట్టుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు.
