35 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కీసర పోలీస్ స్టేషన్ హోంగార్డ్

35 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కీసర పోలీస్ స్టేషన్ హోంగార్డ్

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్లో ఏసీబీ ఆకస్మిక తనిఖీలు జరిపింది. 35 వేల రూపాయలు లంచం తీసుకుంటూ కీసర హోంగార్డ్ నగేష్ ఏసీబీకి పట్టుబడ్డాడు. హోంగార్డ్ నగేష్ గాంధీ ఆసుపత్రి డాక్టర్ సందీప్ పేరు చెప్పి పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలంటే 2 లక్షలు ఇవ్వాలని మొదట డిమాండ్ చేశాడు.

చనిపోయిన అతని మేనల్లుడు శరత్ చివరకు 40 వేలు ఇస్తానని ఒప్పుకున్నాడు. మొదట 5 వేలు తీసుకున్న హోంగార్డ్ నగేష్, రెండవ విడతలో 35 వేలు తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. తోటకూర మహేష్ చనిపోయి నాలుగు నెలలు అవుతున్నా మృతుడి పోస్ట్ మర్టం రిపోర్ట్ కోసం ఎంత తిరిగినా ఇవ్వలేదని బాధితుడు ఆరోపించాడు.

* మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హోం గార్డు నగేష్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ
* కీసర ఔటర్ రింగ్ రోడ్డు వద్ద లంచం ఇస్తుండగా పట్టుకున్న ఏసీబీ పోలీసులు
* పోస్టు మార్టం రిపోర్ట్ విషయంలో బాధితుడిని 40 వేల రూపాయలు లంచం అడిగినట్టు సమచారం
* నగేష్తో పాటు మరో ఇద్దరు ఉన్నట్టు సమాచారం
* ప్రస్తుతం నగేష్ను విచారిస్తున్న ఏసీబీ పోలీసులు