వాణిజ్య పన్నుల శాఖపై ఏసీబీ ఫోకస్

వాణిజ్య పన్నుల శాఖపై ఏసీబీ ఫోకస్
  • 10 ప్రాంతాల్లోని డివిజన్లు, సర్కిల్ ఆఫీసుల్లో ఆకస్మిక తనిఖీలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖలో జరుగుతున్న అవినీతిపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. పన్నుల వసూళ్లు, ఇన్‌‌‌‌పుట్‌‌‌‌ ట్యాక్స్ క్రెడిట్‌‌‌‌ సహా జీఎస్టీ ఎగవేతలకు సంబంధించిన వివరాలను సేకరిస్తోంది. ఈ మేరకు గురువారం సాయంత్రం 6 గంటల నుంచి ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు ప్రారంభించారు.

హైదరాబాద్ రూరల్, అబిడ్స్‌‌‌‌, పంజాగుట్ట, బేగంపేట డివిజన్లతోపాటు ఖైరతాబాద్‌‌‌‌, బోయిన్‌‌‌‌పల్లి,  సోమాజీగూడ, జీడిమెట్ల-2 సర్కిళ్లలో సోదాలు నిర్వహించారు. ఆయా కార్యాలయాల్లోని ట్యాక్స్‌‌‌‌లకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. జీఎస్టీ చెల్లింపుల్లో అవకతవకలు, రికార్డుల్లో పొరపాట్లపై ఏసీబీ అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలిసింది.