ESI స్కాం: నిందితులకు 14 రోజుల రిమాండ్‌

ESI స్కాం: నిందితులకు 14 రోజుల రిమాండ్‌

హైదరాబాద్: ESIస్కాంలో నిందితులకు రిమాండ్ విదించింది ఏసీబీ కోర్టు. దేవిక రాణి సహా 9మందికి 14రోజులు రిమాండ్ విధించింది. దీంతో నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించారు. శుక్రవారం ఆరున్నర కోట్ల అక్రమాలను గుర్తించారు ఏసీబీ అధికారులు. దేవికారాణితో పాటు మరో ఎనిమిది మందిని రెండోసారి అరెస్ట్ చేశారు. నిందితులు నకిలీ ఇండెంట్స్, ఎక్కువ ధరలు కోట్ చేయడం, తప్పుడు లెక్కలతో ప్రభుత్వ ఖజానాకు నష్టం చేసినట్టు అధికారులు చెబుతున్నారు. దేవికారాణిని మొదటిసారి అరెస్ట్ చేసిన తర్వాత ఆమెకు సంబంధించిన 35 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించి ఏసీబీ సీజ్ చేసింది.