మండుతున్న ఎండలు.. వడదెబ్బతో రెండు టన్నుల చేపలు మృతి

మండుతున్న ఎండలు..  వడదెబ్బతో రెండు టన్నుల చేపలు మృతి

మండుతున్న ఎండలను తట్టుకోలేక రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్ గ్రామంలోని కామచెరువులో సుమారు రెండు టన్నుల చేపలు వడదెబ్బతో మృతి చెందాయి.  దీంతో మత్స్యకారులు రోడ్డున పడి తీవ్రంగా నష్టపోయమని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన చేపలను రక్షిచుకునేందుకు బోరు మోటారు సహాయంతో  చెరువులోకి నీటి వదులుతున్నారు.మత్స్యకారులను ప్రభుత్వం కూడ ఆదుకోని,  నష్ట పరిహారం అందిచాలని కోరుకుంటున్నారు. 

మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. మే నెల మొదటి వారం లో రికార్డ్ స్థాయిలో హై టెంపరచర్స్ నమోదవుతున్నాయి. రాష్ట్రంపై తీవ్ర వడగాల్పులు ఉన్నాయని హైదరాబాద్ ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. 10 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుందని వెల్లడించింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాలలో ఆరెంజ్ అలర్ట్ నడుస్తోన్నట్టు తెలిపింది.