వికారాబాద్, వెలుగు: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణను సమర్థవంతంగా అమలు చేయాలని వికారాబాద్ కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్లు రాజేశ్వరి, సుధీర్‌తో కలిసి జిల్లా అధికారులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. పాఠశాలలు, వసతి గృహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, అధికారులు సమన్వయంతో పనిచేసి ఈ ప్రణాళికను విజయవంతం చేయాలని స్పష్టం చేశారు.
అలాగే వికారాబాద్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యతను, మెనూను పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం ఎన్నెపల్లిలోని అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి, పిల్లలకు అందుతున్న పోషకాహారం, ప్రీ-స్కూల్ విద్యా కార్యక్రమాలపై ఆరా తీశారు.
