లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్ సంగీత

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సబ్ రిజిస్ట్రార్ సంగీత

లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ సంగీత ఏసీబీకి పట్టుబడ్డారు. చాంద్రాయణ గుట్టకు చెందిన మహమ్మద్ ఆర్షద్ హుస్సేన్ మాహేశ్వరంలో డాక్యుమెంట్ రైటర్ గా పని చేస్తున్నాడు. గత 6 నెలలుగా కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీల డాక్యుమెంట్లు చేయిస్తున్నాడు. ఈ నెల 21 న 9 డాక్యుమెంట్లకు కలిపి మొత్తం 35 వేలు లంచంగా ఇవ్వాలని మాహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ సంగీత డిమాండ్ చేశారు. దీంతో  అర్షద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ వేసి నిన్న( బుధవారం) రామకృష్ణ అనే మధ్యవర్తికి 30 వేలు ముట్టజెప్పారు. ఇంకా రూ.5వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా ఈ రోజు(గురువారం) గణేష్ అనే మరొకరికి ఇస్తుండగా ఏసీబీ అధికారులు మాహేశ్వరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లో పట్టుకున్నారు. అధికారులు లంచం ఆడిగితే అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించాలని హైదరాబాద్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఎస్.సూర్యనారాయణ తెలిపారు.