ఏసీబీ వలలో పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్

ఏసీబీ వలలో పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్

పెద్దపల్లి జిల్లా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ  ఏసీబీకి చిక్కారు సబ్ రిజిస్ట్రార్ నిర్మల.  సబ్ రిజిస్ట్రార్ తో పాటు అటెండర్  పట్టుకున్నారు అధికారులు.  డాక్యుమెంట్ల కోసం పూదరి శ్రీనివాస్ నుండి 60 వేల రూపాయలు తీసుకుంటుండగా పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ దేవనగిరి నిర్మల, అటెండర్ శ్రీనివాసులను ఏసీబీ డీఎస్పీ భద్ర ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.   గతంలో కూడా డాక్యుమెంట్ల కోసం డబ్బు తీసుకుని  మరోసారి డిమాండ్ చేశాడు. దీంతో  బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించగా ఇవాళ వలపన్ని పట్టుకున్నారు.