
ప్రతి ఒక్కరికి సొంతిల్లు ఉండాలని కలలు కంటారు. గృహనిర్మాణం ఖర్చు లక్షల్లోనే ఉంది. అయితే దానికి అనుమతులు ఇచ్చేందుకు జీహెచ్ఎంసీ అధికారులు జనాలను జలగల్లా పీల్చి పిప్పిచేస్తున్నారు. ఇంటి నిర్మాణం ఒక వంతైతే.. బ్యాంకు లోన్లు... జీహెచ్ఎంసీ అనుమతులు కోసం బిల్డింగ్ కట్టుకోవాలనుకొనే వారు లక్షల మేరకు లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితులు దాపురించాయి.
ALSO READ | హైదరాబాద్ SR నగర్ హాస్టల్స్ పై అధికారుల దాడులు : 15 హాస్టల్స్ కు భారీగా జరిమానా
సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో అవినీతి అధికారుల భరతం పట్టారు ఏసీబీ అధికారులు . బిల్డింగ్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటే లంచం డిమాండ్ చేశారు అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ విట్టల్ రావు. రెండు బిల్డింగ్ల నిర్మాణానికి ఎన్ఓసీ ఇవ్వడానికి రూ. 8 లక్షలు డిమాండ్ చేశారు. మొదటి విడతలో 4లక్ష రూపాయలు తీసుకొని... మరో నాలుగు లక్షల రూపాయలు ఇస్తేనే ఎన్ ఓ సి ఇస్తానని చెప్పిన విఠల్ రావు చెప్పడంతో వెంకట్ అనే వ్యక్తి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు దారుడు అంత ఇచ్చుకోలేనని చెప్పినా.. ఆఫీసర్ విఠల్ రావు ఎన్ఓసీ ఇవ్వకపోవడంతో ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ కు ఫిర్యాదు చేశారు. వెంకట్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు వలవేసి అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ విట్టల్ రావును పట్టుకున్నారు.