యాక్సిడెంట్ కేసు : వాటర్ ట్యాంక్ పై బస్సు డ్రైవర్ నిరసన

యాక్సిడెంట్ కేసు : వాటర్ ట్యాంక్ పై బస్సు డ్రైవర్ నిరసన

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అనవసరంగా తనను యాక్సిడెంట్ కేసులో పోలీసులు ఇరికించారని, వెంటనే తనకు న్యాయం చేయాలంటూ ..పాల్వంచలో RTC బస్సు డ్రైవర్ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపాడు. జూన్- 10న పాల్వంచ జెన్కో కాలనీలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో.. 5 ఏళ్ల బాలుడు జాన్సన్ మృతి చెందాడు.

దీనిపై విచారణ లేకుండ షిఫ్ట్ బస్ ను సీజ్ చేసి, డ్రైవర్ చంద్రంపై కేసు పెట్టారు పోలీసులు. తనకు ఆక్సిడెంట్ కు ఎటువంటి సంబంధం లేకపోయినా.. కేసులో ఇరికించారంటూ ఆవేదనకు గురైన చంద్రం దంపతులు వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటామని చెప్పారు చంద్రం దంపతులు.