ఐ అండ్ పీఆర్లో అక్రెడిటేషన్ల దందా.. కొన్ని పత్రికలకు రెండు సంస్థల పేరుతో అక్రెడిటేషన్లు

ఐ అండ్ పీఆర్లో అక్రెడిటేషన్ల దందా.. కొన్ని పత్రికలకు రెండు సంస్థల పేరుతో అక్రెడిటేషన్లు

ఐ అండ్ పీ ఆర్ లో అక్రమాలు తవ్వేకొద్ది బయట పడుతున్నాయి. నిబంధనలను పక్కన పెట్టి ఇష్టా రాజ్యంగా.. అర్హత లేని డిజిటల్ పత్రికలకు కూడా అక్రెడిటేషన్ కేటాయించారు. పెద్ద పెద్ద పత్రికలు, ఛానళ్లకు అరకొర కార్డులు మంజూరు చేసి.. కనీసం రెండేళ్లు కూడా పూర్తికాని ఒక్కో పత్రికకు రెండు సంస్థల పేరుతో అక్రిడేటిషన్లు కేటాయించడం విమర్శలకు దారితీస్తోంది. 

కొన్ని ప్రధాన పత్రికలకు రెండు సంస్థల పేర్లతో అక్రెడిషన్ కార్డులు జారీ చేస్తున్నారు. బిగ్ పేపర్స్ లిస్టులో ఉన్న ఓ పెద్ద పత్రికకు దాని పబ్లికేషన్స్ పేరు మీద అందులో పనిచేస్తున్న బ్యూరోలు, స్టాఫ్​ రిపోర్టర్లు, సబ్ ఎడిటర్లకు కార్డులు జారీ చేశారు.

ఇదే సంస్థకు అనుబంధంగా ఉన్న న్యూస్​ ఏజెన్సీ పేరుతో మరో లెటర్ ఇవ్వగా, ఆ లెటర్ ఆధారంగా మండలాల విలేకర్లకు కార్డులు ఇచ్చేశారు. అలాగే మరో పెద్ద పత్రికలో పని చేస్తున్న బ్యూరోలు, స్టాఫ్​రిపోర్టర్లు,  సబ్ ఎడిటర్లకు దాని పబ్లికేషన్స్​ పేరిట, మండలాల విలేకరులకు న్యూస్​ ఏజెన్సీ పేరుతో అక్రెడిటేషన్ కార్డులు జారీ చేశారు. ఇది ని బంధనలకు విరుద్ధం.

వాస్తవానికి ఒక పత్రికకు ఒకే సంస్థ పేరు మీద అందులో పని చేస్తున్న జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయాలనే నిబంధన ఉంది. ఐఅండ్​పీఆర్​ ఆఫీసర్లు మాత్రం నిబంధనలను పక్కకు పెట్టి అక్రమంగా అక్రెడిటేషన్ కార్డులు జారీ చేస్తున్నా అడిగేవారు లేరు.