హత్రాస్​ కేసులో మరో ట్విస్ట్..మాతో ఫ్రెండ్ షిప్ ఇష్టం లేకే కొట్టి చంపారు

హత్రాస్​ కేసులో మరో ట్విస్ట్..మాతో ఫ్రెండ్ షిప్ ఇష్టం లేకే కొట్టి చంపారు
  • ‘మా ఫ్రెండ్​షిప్​ ఇష్టంలేక కొట్టి చంపారు’
  • ఎస్కేప్‌‌ అయ్యేందుకు నిందితుల స్కెచ్‌‌.. పోలీసులకు లెటర్‌‌

హత్రాస్: యూపీ హత్రాస్​ ఇన్సిడెంట్ రోజుకో మలుపు తీసుకుంటోంది. చనిపోయిన యువతితోపాటు ఆమె బ్రదర్​తో తమకు పరిచయం ఉందని, కానీ ఆమె చావుకు, తమకు ఏ సంబంధం లేదని ఈ కేసులో నిందితులు లోకల్  ఎస్పీ వినీత్​ జశ్వాల్​కు లేఖ రాశారు. తమ మధ్య ఫ్రెండ్​షిప్​ ఇష్టంలేక ఫ్యామిలీ మెంబర్సే బాలికను కొట్టి చంపారని ప్రధాన నిందితుడు సందీప్​ ఠాకూర్​ లేఖలో ఆరోపించాడు. ఈ కేసులో లోతుగా విచారణ జరిపి తనతోపాటు జైలులో ఉన్న ముగ్గురికి న్యాయం చేయాలని కోరాడు. కావాలనే కొందరు తమను ఇందులో ఇరికించారన్నారు. మేమెప్పుడూ  డైరెక్టుగా కలుసుకోలేదని, కేవలం ఫోన్​లోనే మాట్లాడుకునే వాళ్లమని లేఖలో పేర్కొన్నాడు.  ‘ఘటన జరిగిన రోజు నేను ఆమెను కలిసేందుకు వెళ్లా. వాళ్లమ్మ, బ్రదర్​తో కలిసి పొలంలో పనిచేస్తోంది. కలిసేందుకు కుదరలేదు. వెంటనే వెనక్కి వచ్చేసి పశువులు మేపేందుకు వెళ్లా. ఆ టైమ్​లో అంతవరకే జరిగింది’’  అని పేర్కొన్నాడు.

హత్రాస్‌‌‌‌పై ఆక్స్‌‌‌‌ఫర్డ్‌‌‌‌లో నిరసన

లండన్‌‌‌‌: హత్రాస్‌‌‌‌ ఘటనపై యూపీ సర్కారు తీరుపై లండన్‌‌‌‌లోని ఆక్స్‌‌‌‌ఫర్డ్‌‌‌‌ వర్సిటీకి చెందిన ఇండియన్‌‌‌‌ స్టూడెంట్లు, ఓల్డ్‌‌‌‌ స్టూడెంట్లు, సిబ్బంది మండిపడ్డారు. కులాల అణచివేత, మహిళలపై హింసను యూపీ సర్కారు ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ‘దళిత్‌‌‌‌ విమెన్‌‌‌‌ మ్యాటర్‌‌‌‌’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. 117 మంది నిరసన తెలిపారు. దేశంలో కింది కులాలు, మహిళలపై హింస పెరుగుతోందని.. ఇది ఆందోళనకరమన్నారు. ఇటీవలి హత్రాస్‌‌‌‌ ఘటనలో పోలీసులు, యూపీ సర్కారు వ్యవహరించిన తీరును ఖండిస్తున్నామన్నారు. బాధిత ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం, ఊరు మొత్తాన్నీ బ్లాక్‌‌‌‌ చేయడం, మీడియా మూమెంట్‌‌‌‌ను ఆపేయడం, ప్రతిపక్షాలు వెళ్లకుండా అడ్డుకోవడమేంటన్నారు.