చంచల్​గూడ జైలుకు రిమాండ్ ఖైదీగా ఏసీపీ నర్సింహారెడ్డి

చంచల్​గూడ జైలుకు రిమాండ్ ఖైదీగా ఏసీపీ నర్సింహారెడ్డి

14 రోజుల రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
కొనసాగిన అధికారుల సోదాలు
ఓ మహిళ పేరిట ఉన్న 4 ఎకరాల ల్యాండ్ డాక్యుమెంట్లు సీజ్
అనంతపురంలో మరో 100 ఎకరాల భూమి

హైదరాబాద్​, వెలుగు: మల్కాజిగిరి ఏసీపీ నర్సింహారెడ్డికి ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్​ రిమాండ్​ విధించింది. అక్రమాస్తుల కేసులో బుధవారం ఆయన్ను అరెస్ట్​ చేసిన ఏసీబీ అధికారులు.. గురువారం ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. వైద్య పరీ క్షలు చేసిన తర్వాత మణికొండలోని జడ్జి ఇంటికి తీసుకెళ్లారు. మధ్యాహ్నం వరకు జడ్జి విచారణ చేశారు. తర్వాత జడ్జి ఆదేశాలతో అధికారులు నర్సింహారెడ్డిని చంచల్​గూడ జైలుకు తరలించారు.

మరిన్ని ఆస్తులు గుర్తింపు

బుధవారం తెలంగాణ, ఏపీల్లో 25 చోట్ల సోదాలు చేసిన ఏసీబీ అధికారులు.. గురువారం కూడా తనిఖీలు కొనసాగించారు. కొండాపూర్​లోని అసైన్డ్​ భూములతో రియల్​ఎస్టేట్​ వ్యాపారం చేసినట్టు గుర్తించారు. మహేంద్రహిల్స్​లోని బ్యాంక్​ లాకర్​ను ఓపెన్​ చేసి బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్​లోని ఓ మహిళ పేరిట కొనుగోలు చేసిన 4 ఎకరాల ల్యాండ్​ డాక్యుమెంట్లను గుర్తించి వాటిని సీజ్​చేశారు. అనంతపురంలో మరో 100 ఎకరాల ల్యాండ్​ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. కాగా, పనిచేసిన పోలీస్​స్టేషన్స్​ నుంచే నర్సింహారెడ్డి నెట్​వర్క్​ పెంచుకున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. రియల్​ఎస్టేట్​ వ్యాపారంతో పాటు బినామీ పేర్లతో హోటళ్లు, బార్లను నడుపుతున్నట్టు ఆధారాలు సేకరించారు. డిపార్ట్​మెంట్​లో పలుకుబడిని ఉపయోగించి శివారు ప్రాంతాలైన రాచకొండ, సైబరాబాద్​ కమిషనరేట్ల పరిధిలో పోస్టింగ్స్​ తెచ్చుకున్నట్టు తెలుస్తోంది.

For More News..

ఎన్‌కౌంటర్ మృతులకు రీపోస్టుమార్టం చేయండి

తెలంగాణ సర్కార్‌ను నిలదీసిన హైకోర్టు

ఎన్నికల మీద ఫోకస్.. కరోనా కట్టడి ఫసక్..