ఎవరైనా హోటల్ లో తిన్న తర్వాత పదో.. ఇరవై టిప్ ఇస్తాం. ఒక్కోసారి అది కూడా ఇవ్వం. కానీ అమెరికాలోని ఇల్లినాయిస్ హోటల్ లో ఓ యాక్టర్ ఇచ్చిన టిప్ ఎంతో తెలిస్తే నోరెల్లబెట్టడం గ్యారంటీ. న్యూ ఇయర్ రోజున అతను ఆ హోటల్ లో తిన్న భోజనం ఖర్చు రూ.5597 అయితే సర్వర్ కు టిప్ ఇచ్చింది రూ. 1.44 లక్షలు. ఓ సర్వర్ కు ఇంత టిప్ ఇవ్వడంతో అతడిని సోషల్ మీడియాలో ప్రశంసిస్తున్నారు.
ప్రముఖ యాక్టర్ మార్క్ వాల్బెర్గ్ సోదరుడు సింగర్, నటుడు డోన్నీవాల్బెర్గ్ 01.01.2020 రోజున ఇల్లినాయిస్ హోటల్ కు భోజనానికి వెళ్లాడు. తిన్న తర్వాత సర్వర్ ను బిల్ తీసుకురమ్మని చెప్పాడు. దీంతో మహిళా సర్వర్ బిల్లు తెచ్చింది. బిల్లు ఎంత అని అడగ్గా 78 డాలర్లు(రూ.5597) అని చెప్పింది. దీంతో డోన్నీ వాల్బెర్గ్ బిల్లుకు అదనంగా 2020 డాలర్లు( రూ.1.44లక్షలు) నగదును ఆమెకు ఇచ్చాడు. ఒక్కసారి షాక్ అయిన ఆ సర్వర్ ఇంత డబ్బు ఎందుకని ప్రశ్నించగా ..హ్యాపీ న్యూ ఇయర్ .. కొత్త సంవత్సరం సందర్భంగా ఇది నేనిస్తున్న టిప్ అని చెప్పాడు. ఇది న్యూ ఇయర్ 2020tipchallenge అని బిల్ పై రాసి ఇచ్చాడు.
ఈ విషయాన్ని డోన్నీ వాల్బెర్గ్ వైఫ్ జెన్నీ మెక్‌కార్తి తన ట్విటర్లో పోస్ట్ చేశారు. తన భర్త అధ్బుతమైన వ్యక్తి..న్యూ ఇయర్ ను ఇలా స్టార్ట్ చేశాడని తెలిపింది. అంతేగాకుండా ఇది న్యూ ఇయర్ టిప్ ఛాలెంజ్ అని #2020tipchallenge అని బిల్ ను పోస్ట్ చేసింది.
. @DonnieWahlberg starting 2020 off like the amazing man he is. #ihop #2020tipchallenge
? pic.twitter.com/AjAEN0hqL6— Jenny McC-Wahlberg (@JennyMcCarthy) January 1, 2020
