మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కొత్త సినిమాని ప్రకటించాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ మూవీకి ‘బరి’ (Bhari) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ ప్రాజెక్ట్ని మెగా డాటర్, వరుణ్ తేజ్ చెల్లి నిహారిక కొణిదెల నిర్మిస్తోంది. కమిటీ కుర్రోళ్లు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ యదు వంశీ సినిమాని తెరకెక్కిస్తున్నారు.
ఈ సందర్భంగా శుక్రవారం (2026 మార్చి 28న) మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘బరి’కి క్లాప్ కొట్టి, మేకర్స్ కు బెస్ట్ విషెస్ అందించారు. తమ బాబాయ్ పవర్ స్టార్ చేతుల మీదుగా సినిమా లాంచ్ కావడంతో వరుణ్ తేజ్, నిహారిక సంతోషం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ పూర్తి చేసుకుంది. త్వరలో షూటింగ్ స్టార్ట్ చేసి 2027 సంక్రాంతి బరిలో దిగనుంది. ఈ భారీ చిత్రంలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది.
The net is set. The game is ON. ⚡️
— Pink Elephant Pictures (@PinkElephant_P) March 28, 2026
ఇక 'బరి' లోకి దూకుదామా? ❤️🔥
Serving up the First Look of #Bhari! A high-voltage drama that is set to shake the stands. 🏟️🔥#BhariFirstLook #BhariTheFilm#Bhari | #బరి | #बरी | #ಬರಿ | #பரி | #ബരി
Mega Prince @IAmVarunTej ❤️🔥#NiharikaKonidela… pic.twitter.com/8EWOwrBy8E
వరుణ్ తేజ్ ‘బరి’ పోస్టర్:
హై-వోల్టేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా బరి (Bhari) మూవీ తెరకెక్కుతుంది. వాలీబాల్ కథా నేపథ్యంతో ఎమోషనల్ డ్రామాగా రూపొందిస్తున్నారు డైరెక్టర్ యదు వంశీ. ఈ క్రమంలో రిలీజ్ చేసిన బరి ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది. " బరి ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నాం! ఈల మోగింది. ఉత్సాహం ఉరకలేస్తోంది. జనసందోహాన్ని హోరెత్తించేలా చేసే అత్యంత ఉత్కంఠభరితమైన డ్రామాని ఆవిష్కరిస్తున్నాం" అని మేకర్స్ ట్వీట్ చేశారు.
Introducing The World Of #Bhari! 🌍
— Pink Elephant Pictures (@PinkElephant_P) March 28, 2026
The whistle is blown. The adrenaline is pumping. ⚡️
Unleashing a high-voltage drama guaranteed to make the crowds roar. 🏟️🔥
▶️ Experience it here: https://t.co/S5rcJiE3Ec#BhariFirstLook #BhariTheFilm#Bhari | #బరి | #बरि | #ಬರಿ | #பரி |… pic.twitter.com/lZds91PJ5E
వరుణ్ తేజ్ వరుస ఫెయిల్యూర్స్:
వరుణ్ తేజ్ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ను ఎంచుకుంటూ వస్తోన్న విజయానికి చాలా దూరంలో ఉంటున్నాడు. గత నాలుగు సినిమాలు గని, గాండీవదారి అర్జున, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా వరుణ్కు ఎలాంటి ప్రయోజనాన్ని ఇవ్వలేకపోయాయి. ఈ క్రమంలోనే బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టాలనే సంకల్పంతో వరుణ్ కంకణం కట్టుకున్నారు.
ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కొరియన్ కనకరాజు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కథ సగ భాగం కొరియాలో, మరొక భాగం రాయలసీమ నేపథ్యంలో ఉండనుంది. ఇప్పటికే, టీజర్ రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుని, అంచనాలు పెంచేసింది. ఇప్పుడు ఈ యువ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ యదు వంశీతో సినిమా చేస్తూ మెగా ఫ్యాన్స్ లో జోష్ పెంచారు.
యదు వంశీ గద్దర్ అవార్డ్:
‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు గాను డైరెక్టర్ యదు వంశీ ప్రతిష్టాత్మక గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ నూతన దర్శకుడిగా (Best Debut Director) అవార్డును గెలుచుకున్నారు. సామాజిక సందేశాన్ని కామెడీతో మిళితం చేసి, గోదావరి పరిసర ప్రాంతాల సహజత్వాన్ని అద్భుతంగా తెరపై చూపించారు యదు వంశీ.
సుమారు రూ.9 కోట్ల బడ్జెట్తో నిర్మితమైన ఈ సినిమా, థియేట్రికల్ మరియు నాన్-థియేట్రికల్ హక్కుల ద్వారా కలిపి సుమారు రూ.24.5 కోట్ల వసూళ్లు సాధించి, కమర్షియల్‌గా సక్సెస్ అందుకుంది.
