ఐపీఎల్ సందడి..బెట్టింగ్ రాయుళ్లకు సజ్జనార్ వార్నింగ్

ఐపీఎల్ సందడి..బెట్టింగ్ రాయుళ్లకు సజ్జనార్ వార్నింగ్

ఇవాళ్టి నుంచి ఐపీఎల్ సీజన్ 19  సందడి . తొలి రోజు ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్ తలపడనున్నాయి.  ఈ క్రమంలో క్రికెట్ ఫ్యాన్స్ కు హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు . క్రికెట్‌ను కేవలం క్రీడగా ఆస్వాదించాలని, బెట్టింగ్ ఊబిలో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు.  

గతంలో SayNoToBettingApps ప్రచారం ద్వారా వందలాది యాప్‌లను ప్రభుత్వం నిషేధించినప్పటికీ, ఇప్పుడు టెలిగ్రామ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికగా ఈ దందా కొత్త రూపం దాల్చిందని చెప్పారు.   కేవలం డబ్బు కోసం ఇటువంటి ప్రమాదకరమైన యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  

ఆన్‌లైన్ మాత్రమే కాకుండా ఫామ్ హౌస్‌లు, రహస్య ప్రాంతాల్లో సాగే ఆఫ్‌లైన్ బెట్టింగ్‌లపై మా ప్రత్యేక నిఘా పెట్టామని చెప్పారు. బెట్టింగ్ వల్ల అప్పులపాలై కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు. మీ పరిసరాల్లో ఎవరైనా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 లేదా తమ వాట్సాప్ నంబర్ 94906 16555 కు సమాచారం ఇవ్వాలని సజ్జనార్ తెలిపారు.