అమెరికా అధ్యక్షుడు ట్రంప్ క్లోజ్ ఫ్రెండ్, ప్రముఖ గోల్ఫ్ ప్లేయర్ టైగర్ వుడ్స్ అరెస్ట్ వార్త సంచలనంగా మారింది. శుక్రవారం (మార్చి 27) ఫ్లోరిడాలోని తన జూపిటర్ ఐలండ్ లో జరిగిన కార్ క్రాష్ కేసులో అరెస్టు చేశారు. అరెస్టు తర్వాత మార్టిన్ కంట్రీ జైలుకు తరలించిన పోలీసులు.. శనివారం అరెస్టుకు సంబంధించిన ఫోటోలు రిలీజ్ చేశారు.
ఐలండ్ లో జరిగిన కార్ క్రాష్ లో ల్యాండ్ రోవర్ కార్ కారు పల్టీలు కొడుతూ పడిపోయింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి గాయాలు లేకుండా వుడ్స్ బయటపడ్డారు. రెండు లేన్ల రోడ్డులో ఓవర్ టేక్ చేస్తున్న సందర్భంగా ట్రక్కును ఢీకొట్టి పల్టీ కొట్టింది. దీంతో వుడ్స్ ను అరెస్టు చేసిన మార్టిన్ కౌంటీ షెరీఫ్.. అరెస్ట్ కు సంబంధించిన ఫోటోలు రిలీజ్ చేసింది.
బ్లూ షర్ట్ వేసుకుని.. కెమెరాకు స్ట్రైట్ గా చూస్తున్న ఫోటోలు రిలీజ్ చేశారు. అదే విధంగా క్రాష్ కు సంబంధించి ఫోటోలు కూడా విడుల చేశారు. ఈ సందర్భంగా కౌంటీ షరీఫ్ మాట్లాడుతూ.. ఓవర్ స్పీడ్ తో పాటు డ్రగ్స్ లేదా మద్యం మత్తులో ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. క్రాష్ తర్వాత ప్యాసెంజర్ గ్లాస్ నుంచి పాకుతూ బయటకు వచ్చినట్లు చెప్పారు.
DUI (డ్రైవింగ్ అండర్ ఇన్ ఫ్లుయెన్స్) టెస్ట్ చేస్తుండగా.. యూరిన్ టెస్టుకు వుడ్స్ నిరాకరించినట్లు తెలిపారు. బ్రీత్ అనలైజర్ టెస్టుకు అంగీకరించిన వుడ్స్.. అందులో ఆల్కహాల్ సేవించినట్లుగా నిర్ధారణ కాలేదని అన్నారు. డ్రగ్స్ లేదా కెమికల్స్ ఏవైనా తీసుకుని ఉండవచ్చునని.. అందుకే యూరిన్ టెస్టుకు నిరాకరించి ఉంటారని పేర్కొన్నారు.
నాలుగో సారి..
15 సార్లు ప్రపంచ గోల్ఫ్ ఛాంపియన్ గా చరిత్రకెక్కిన లెజెండ్.. టైగర్ వుడ్స్ కార్ క్రాష్ కేసులో అరెస్ట్ కావడం ఇది నాలుగోసారి. డ్రగ్స్ లేదా ఆల్కహాల్ సేవించి డ్రైవింగ్ చేసిన కేసులో అరెస్టు కావడం ఇది రెండో సారి. డ్రగ్స్ తీసుకుని డ్రైవింగ్ చేసిన కేసులో 2017 లో కూడా అరెస్టయ్యారు. ఆ యాక్సిడెంట్ లో కారు టైర్ కింద నిద్రమత్తులో పడి ఉండగా పోలీసులు రక్షించి ఆ తర్వాత జైలుకు పంపించారు. డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసిన మోతాదులోనే పెయిన్ కిల్లర్స్ వాడినట్లు ఈ సందర్భంగా వుడ్స్ చెప్పారు.
ట్రంప్ రెస్పాన్స్:
తన స్నేహితుడు టైగర్ వుడ్స్ యాక్సిడెంట్ పై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ స్పందించారు. వుడ్స్ కాస్త ఇబ్బందుల్లో ఉన్నారు.. అని ఈ సందర్భంగా ట్రంప్ అన్నారు. అక్కడ యాక్సిడెంట్ అయింది.. అది నాకు తెలుసు.. నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్.. వుడ్స్ వెరీ అమేజింగ్ పర్సన్.. కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.. దాని గురించి మాట్లాడదల్చుకోలేదు.. అంటూ తన ట్రంప్ కామెంట్ చేశాడు.
Tiger Woods mugshot from today's DUI arrest @CBSNews pic.twitter.com/Xuvy1QEscP
— Cristian Benavides (@cbenavidesTV) March 28, 2026
