హైదరాబాద్, వెలుగు: రెన్యూవబుల్ఎనర్జీకి సంబంధించి గ్రీన్‌కో సంస్థతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలపై తక్షణమే దర్యాప్తు చేయించాలని సామాజిక కార్యకర్త బక్క జడ్సన్ డిమాండ్ చేశారు. శనివారం ఈడీకి అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఏపీలోని కర్నూలు జిల్లా పిన్నాపురంలో గ్రీన్‌కో సంస్థ ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ రిన్యూవబుల్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై ఇప్పటికే అనేక తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు.
ఇలాంటి సంస్థ నుంచి యూనిట్ విద్యుత్‌ను రూ.6.70 నుంచి రూ.6.75 చొప్పున అధిక రేటుకు జెన్కో ద్వారా కొనిపించేందుకు ప్రభుత్వం పీపీఏ చేసుకుందని మండిపడ్డారు. విద్యుత్ చట్టం-2003 ప్రకారం పోటీ బిడ్డింగ్ విధానాలు పాటించలేదని, నియంత్రణ కమిషన్ నుంచి అనుమతులు తీసుకోలేదని జడ్సన్ ఆరోపించారు.
