
ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్(APFDC) గా హాస్యనటుడు అలీ నియమితులయ్యారు. దీనికి సంబంధించి జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు విడుదల కానున్నాయి. రాజమండ్రి కి చెందిన సినీ హాస్యనటుడు చాలా కాలం తెలుగుదేశం పార్టీకి అభిమానిగా ఉన్నారు. 2019 ఎన్నికల సమయంలో ఆయన YCPలో చేరారు. గుంటూరు నుంచి టిక్కెట్ ను ఆశించిన అలీకి అక్కడ సమీకరణాలతో టిక్కెట్ లభించలేదు. అయితే అలీని APFDC ఛైర్మన్ గా నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.