భారత్ జోడో యాత్రలో కమల్ హాసన్

భారత్ జోడో యాత్రలో కమల్ హాసన్

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో నేతృత్వంలో కొనసాగుతోన్న భారత్ జోడో యాత్రలో పార్టీ నేతలతో పాటుగా వివధ రంగాలకి సంబంధించిన ప్రముఖులు కూడా పాల్లొంటున్నారు. శుక్రవారం ( డిసెంబర్ 22)న భారత్ జోడో యాత్ర 100 వ రోజుకు చేరుకోనుంది. ఈ సందర్భంగా యాత్రలో ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మైయం అధినేత కమల్ హాసన్  పాల్గొని సందడి చేయనున్నారు. రాహుల్ ఆహ్వానం మేరకు కమల్ యాత్రలో పాల్గొననున్నారని మక్కల్ నీది మైయం పార్టీ వర్గాలు వెల్లడించాయి. 

భారత్ జోడో యాత్ర డిసెంబర్ 24న ఢిల్లీలో ప్రవేశిస్తుంది.  దాదాపు ఎనిమిది రోజుల విరామం తర్వాత బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, హర్యానాలో కొనసాగుతుంది. చివరగా జమ్మూ కాశ్మీర్‌లోకి ప్రవేశించే ముందు పంజాబ్‌లో రాహుల్ యాత్ర చేయనున్నారు.  సెప్టెంబరు 7న కన్యాకుమారిలో మొదలైన భారత్‌ జోడో యాత్ర తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌ లో పూర్తి చేసుకుని ప్రస్తుతం రాజస్థాన్‌లో కొనసాగుతోంది.