
మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) స్థాపించిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్(Chiranjeevi Charitable Trust) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ట్రస్ట్ ద్వారా చిరంజీవి అభిమానులెందరో రక్త, నేత్ర దానం చేసి కొన్ని లక్షల మందికి సహాయాన్ని అందించారు. ప్రమాదంలో సమయానికి రక్త అందక ఎవరు చనిపోకూడదు అనే సహృదయంతో ఈ ట్రస్ట్ ను స్థాపించారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఈ ట్రస్ట్ స్థాపించిన రోజు మొదటగా నటుడు మురళి మోహన్ రక్తం ఇవ్వగా.. రెండో వ్యక్తిగా నటుడు మహర్షి రాఘవ(Maharshi Raghava) రక్తదానం చేశారు.
అయితే.. తాజాగా వందోసారి రక్తదానం చేశారు నటుడు మహర్షి. ఇప్పటికే చాలా మంది చిరంజీవి అభిమానులు 60 సార్లు, 70 సార్లు రక్తదానం చేసినవారు ఉన్నారు కానీ, వందసార్లు చేసిన మొదటివ్యక్తిగా రికార్డ్ క్రియేట్ చేశారు నటుడు మహర్షి రాఘవ. ఈ ప్రత్యేకమైన సందర్భాన్ని పురస్కరించుకొని మహర్షిని తన ఇంటికి ఆహ్వానించుకొని సన్మానించారు మెగాస్టార్. అయితే గతంలో చిరంజీవి మహర్షికి ఓ మాట ఇచ్చారట. నువ్వు వందవసారి రక్తదానం చేసేటప్పుడు నీ పక్కనే ఉంటాను అని. కానీ, ఆ సమయంలో చిరు చెన్నైలో ఉండటంతో కుదరలేదు.
చెన్నై నుండి రాగానే.. మహర్షి రాఘవని ఇంటికి పిలిపించుకొని మరీ సత్కారించారు మెగాస్టార్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. నేను ఈ ట్రస్ట్ మొదలుపెట్టినరోజు రక్తదానం చేసిన రెండో వ్యక్తి మహర్షి రాఘవ. అలాంటి వ్యక్తి ఇప్పటివరకు వందసార్లు రక్తదానం చేయడం అనేది మాములు విషయం కాదు. మహర్షి చేసిన ఈ పనికి నాకు చాలా ఆనందంగా ఉంది.. అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు చిరు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.