డ్రగ్స్ తో నిహారికకు ఎలాంటి సంబంధం లేదు

డ్రగ్స్ తో  నిహారికకు ఎలాంటి సంబంధం లేదు

హైదరాబాద్: బంజరాహిల్స్ రాడిసన్‌ బ్లూ పబ్‌ వ్యవహారంలో తన కుమార్తె నిహారికపై వస్తున్న వార్తలపై నటుడు నాగబాబు స్పందించారు. పోలీసులు పబ్ పై దాడి చేసినప్పుడు పబ్ లో తన కూతురు నిహారిక ఉన్నది నిజమేనని, కానీ తనకు డ్రగ్స్ తో ఎలాంటి సంబంధంలేదని క్లారిటీ ఇచ్చారు. పరిమిత సమయాన్ని మించి నడుపుతుండటంతో పోలీసులు పబ్‌పై యాక్షన్ తీసుకున్నారని తెలిపారు. పోలీసులు తమకు ఇచ్చిన సమాచారం మేరకు.. నిహారిక విషయంలో ఎటువంటి తప్పు లేదని చెప్పినట్లు నాగబాబు స్పష్టం చేశారు. దీనిపై  మీడియాలో ఎలాంటి ఊహాగానాలకు తావు ఇవ్వొద్దని కోరారు.

మరిన్ని వార్తల కోసం..

డ్రగ్స్‌ వ్యవహారం.. బంజారాహిల్స్ సీఐ సస్పెన్షన్