టీజీ సేఫ్ తనిఖీలు.. 9 హోటళ్ల లైసెన్సులు రద్దు

టీజీ సేఫ్ తనిఖీలు.. 9 హోటళ్ల లైసెన్సులు రద్దు

హైదరాబాద్, వెలుగు: ఎల్బీనగర్ పరిధిలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార తయారీ కేంద్రాలపై టీజీ సేఫ్ విభాగం కొరడా ఝళిపించింది. పది స్పెషల్ టీములు బుధవారం 20 సంస్థల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కిచెన్లలో తీవ్రమైన అపరిశుభ్రత, కుళ్లిన మాంసం, బొద్దింకలు, ఎలుకల సంచారం, సింథటిక్ రంగులు, కాలం చెల్లిన ఆహార పదార్థాల వాడకం బయటపడింది. ఉల్లంఘనలకు పాల్పడిన 9 సంస్థల ఎఫ్‌‌ఎస్‌‌ఎస్‌‌ఏఐ లైసెన్సులను తక్షణమే సస్పెండ్ చేశారు.

నిబంధనలు పాటించని మరో 7 సంస్థలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. నలుగురికి ఇంప్రూమెంట్ నోటీసులిచ్చారు. 20 ఫుడ్ శాంపిల్స్ ను సేకరించి ల్యాబ్‌‌ పరీక్షలకు పంపడంతో పాటు, హోటళ్లలో గుర్తించిన కుళ్లిన కూరగాయలు, నిల్వ ఉంచిన మాంసం, పురుగులు పట్టిన పిండి పదార్థాలు, వేరుశనగలను అధికారులు అక్కడికక్కడే పారబోయించి ధ్వంసం చేశారు.