‘అన్‌‌‌‌‌‌‌‌స్టాపబుల్’ సెకెండ్ సీజన్‌‌‌‌‌‌‌‌ కు రెడీ అయిన బాలయ్య

‘అన్‌‌‌‌‌‌‌‌స్టాపబుల్’ సెకెండ్ సీజన్‌‌‌‌‌‌‌‌ కు రెడీ అయిన బాలయ్య

ప్రశ్నల్లో ఫైర్.. ఆటల్లో డేర్.. సరదాల్లో సెటైర్.. అదే తన స్టైల్ అంటున్నారు బాలకృష్ణ. వెండితెర మీద విశ్వరూపాన్ని చూపించే ఆయన.. ఓటీటీలో తనలోని సరికొత్త రూపాన్ని పరిచయం చేశారు. ‘అన్‌‌‌‌‌‌‌‌స్టాపబుల్’ అంటూ హోస్ట్‌‌‌‌‌‌‌‌గా దూసుకొచ్చారు. సెకెండ్ సీజన్‌‌‌‌‌‌‌‌తో మరింత దూసుకుపోవడానికి రెడీ అయ్యారు. ‘అన్‌‌‌‌‌‌‌‌స్టాపబుల్ 2’ అక్టోబర్ 14 నుంచి ఆహాలో స్ట్రీమింగ్‌‌‌‌‌‌‌‌కి వస్తోంది. వారానికో ఎపిసోడ్ చొప్పున ప్రేక్షకుల్ని ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్ చేయనుంది. దీంతో ప్రమోషన్స్‌‌‌‌‌‌‌‌ పీక్స్‌‌‌‌‌‌‌‌లో సాగుతున్నాయి. దర్శకుడు ప్రశాంత్‌‌‌‌‌‌‌‌ వర్మ కట్ చేసిన ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నిన్న లాంచ్ చేశారు. ఇందులో బాలయ్య ఎనర్జీ పీక్స్‌‌‌‌‌‌‌‌లో ఉంది.

అంధకార అభయారణ్యంలో నిక్షిప్తమైన నిగూఢ నిధిని సాధించడానికి వెళ్లే వీరుడిగా కనిపించారాయన. అక్కడ ఎదురయ్యే సవాళ్లు అన్‌‌‌‌‌‌‌‌ప్రిడిక్టబుల్ అని, ఆగని తన పోరాటం అన్‌‌‌‌‌‌‌‌స్టాపబుల్ అని చెబుతూ యాక్షన్‌‌‌‌‌‌‌‌ సీన్స్‌‌‌‌‌‌‌‌తో ప్రేక్షకుల ఆసక్తిని పీక్స్‌‌‌‌‌‌‌‌కి  తీసుకెళ్లారు. గెలుపే ఊపిరిగా, పట్టుదలే ప్రాణంగా, ఆశయమే గమ్యంగా పోరాడే యోధుడికి విజయం అన్‌‌‌‌‌‌‌‌స్టాపబుల్ అంటూ తనదైన శైలిలో జోష్‌‌‌‌‌‌‌‌ తెప్పించారు. మొత్తంగా మొదటి సీజన్‌‌‌‌‌‌‌‌ని మించి రెండో సీజన్ ఉండబోతోందని ఈ ట్రైలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా హింట్ ఇచ్చారు. ‘దెబ్బకి థింకింగ్ మారిపోవాల’ అంటూ ఆయన చెప్పిన డైలాగ్ ఇప్పటికే వైరల్ అయ్యింది. మరి షో ఇంకెంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాల్సిందే!