
అభినవ్ గోమటం లీడ్ రోల్‌లో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. శాలినీ కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ మండూరి కీలక పాత్రలు పోషించారు. గోజల మహేశ్వర్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఆహా ఓటీటీ ద్వారా విడుదల అవుతోంది. బుధవారం జరిగిన ఈవెంట్‌లో ప్రియదర్శి ట్రైలర్‌ను లాంచ్ చేసి, టీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పాడు. అభినవ్ గోమటం మాట్లాడుతూ ‘ఈ కంటెంట్ చాలా ఎక్సయిటింగ్‌గా ఉంటుంది. శాలినీ స్ర్కిప్ట్ అందించడంతో పాటు ఇందులో బాగా నటించింది. ఈ ప్రాజెక్ట్ అందరికీ మంచి పేరు తెస్తుందని భావిస్తున్నా’ అన్నాడు.
ఇదొక నేచురల్ స్టోరీ. అమ్మాయి కష్టాలపై జోక్స్ వేసుకుని నవ్వించేలా ఉంటుంది. నా క్యారెక్టర్ ఒరిజినాలిటీకి దగ్గరగా ఉంటుంది’ అని దివ్య శ్రీపాద చెప్పింది. శాలినీ మాట్లాడుతూ ‘ఈ కథను ముందు వెబ్ సిరీస్‌గా చేద్దామనుకున్నాం. ఫిల్మ్‌కు కూడా వర్కవుట్ అవుతుందని భావించి సినిమాగా చేశాం. నాలో కాన్ఫిడెన్స్ పెంచిన ఆహా టీమ్‌కు థ్యాంక్స్’ అని చెప్పింది. చాలా తక్కువ బడ్జెట్‌లో, తక్కువ టైమ్‌లో మంచి అవుట్‌పుట్ వచ్చిందని నిర్మాత మహేశ్వర్ రెడ్డి అన్నారు. నటులు శశాంక్, నిఖిల్, వంశీ, స్నేహల్, మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అర్సాడా పాల్గొన్నారు.