SSR Death Case: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు..బాంబే హైకోర్టులో రియా చక్రవర్తికి ఊరట

SSR Death Case: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు..బాంబే హైకోర్టులో రియా చక్రవర్తికి ఊరట

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) కేసుకు సంబంధించి విచార‌ణ ఇప్ప‌టికీ మీడియాలో స్పెషల్ హెడ్ లైన్స్లో నిలుస్తోంది.సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై దర్యాప్తునకు సంబంధించి రియా చక్రవర్తి (Rhea Chakraborty), ఆమె సోదరుడు షోక్ చక్రవర్తి, మరియు తండ్రి ఇంద్రజిత్‌లపై సీబీఐ జారీ చేసిన లుక్ అవుట్ సర్క్యులర్‌లను (ఎల్‌ఓసి) బాంబే హైకోర్టు (Bombay High Court) తాజా విచార‌ణ‌లో గురువారం (ఫిబ్రవరి 22న) రద్దు చేసింది.

2020లో తమపై జారీ చేసిన LOCలకు వ్యతిరేకంగా రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోక్ మరియు వారి తండ్రి ఇంద్రజిత్ దాఖలు చేసిన పిటిషన్‌లను న్యాయమూర్తులు రేవతి మోహితే డేరే, మంజుషా దేశ్‌పాండేలతో కూడిన డివిజన్ బెంచ్ అనుమతించింది. పిటిఐలోని ఒక నివేదిక ప్రకారం, తాజా విచార‌ణ‌లో హైకోర్టు బెంచ్ అభ్యర్థనను తిరస్కరించడంతో ఆర్డర్‌పై స్టే కోసం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) చేసిన అభ్యర్థనకు ఎదురుదెబ్బ తగిలింది. 

వివరాల్లోకి వెళితే:

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ 14 జూన్ 14, 2020లో సబర్బన్ బాంద్రాలోని తన అపార్ట్‌మెంట్‌లో మృతుడిగా కనిపించాడు. దీని తరువాత ముంబై పోలీసులు మ‌ర‌ణంపై యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ నమోదు చేసి, కేసు దర్యాప్తు ప్రారంభించారు. అయితే బీహార్‌లో రియా చక్రవర్తి ఆమె కుటుంబ సభ్యులపై సుశాంత్ రాజ్‌పుత్ తండ్రి ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆరోపించారు. ఆ తర్వాత ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి బదిలీ చేయడంతో అప్పటి నుంచి దీనిపై విచారణ చేపట్టారు.

2020 ఆగస్టులో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోక్..ఆమె తండ్రిపై లుకౌట్ సర్క్యులర్‌లు (LOCలు) జారీ చేయడంతో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఇంకా సెప్టెంబర్ 2023లో హైకోర్టు రియా సోదరుడు షోక్‌పై LOCని తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. అంతేకాకుండా అతడు విదేశాలకు వెళ్లడానికి వీలు కల్పించింది. ఇప్పుడు రియా స‌హా ఆ కుటుంబంపై ఉన్న ఎల్.వో.సిల‌ను బాంబే హైకోర్టు ర‌ద్దు చేసింది.