Trisha: రోజుకు రూ.25 లక్షలు..అన్నాడీఎంకే నేతకు త్రిష లీగల్ నోటీస్

Trisha:  రోజుకు రూ.25 లక్షలు..అన్నాడీఎంకే నేతకు త్రిష లీగల్ నోటీస్

హీరోయిన్ త్రిష (Trisha)పై అన్నాడీఎంకే మాజీ నేత యూనియన్ సెక్రటరీ ఏవీ రాజు చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. హీరోయిన్ త్రిష వ్యక్తిగత జీవితంపై ఏవీ రాజు బహిరంగంగా మాట్లాడిన మాటలకు సినీ ఇండస్ట్రీ అంత ఏకం అవుతుంది.అత‌డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పలువురు సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..అన్నాడీఎంకే మాజీ నేత ఏవీ రాజుకు నటి త్రిష తరుపు లాయర్‌ నోటీసు పంపారు. ఇదే విషయాన్ని హీరోయిన్  త్రిష తన ఎక్స్(X) ఖాతా ద్వారా లీగల్ నోటీసుల ఫోటోలను పోస్ట్ చేసింది.ఈ నోటీసు కాపీలో త్రిష తన గురించి AV రాజు మాట్లాడిన వీడియోలు, ఆ వీడియోల గురించి పలు న్యూస్ మీడియాలో వచ్చిన వార్తల లింక్‌లను కూడా యాడ్ చేశారు. 

అయితే, ఏవీ రాజు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో త్రిష భారీ మొత్తంలో నష్టపరిహారం కోరినట్లు నోటీసులో తెలిపింది. కానీ,  ఎంత అమౌంట్ అడిగారనేది కనపడకుండా దాన్ని కవర్ చేశారు. అలాగే ఈ నోటీసులో మాత్రం త్రిష కోల్పోయిన మానసిక స్థాయిని మాత్రం వెల్లడించింది. ఎ.వి.రాజు చేసిన ఆరోపణల కారణంగా త్రిష ఎంతో మానసిక క్షోభకు గురైందని, దీంతో 4 రోజులలో తన  వ్యక్తిగతమైన జీవితంపై పలు సోషల్ మీడియాలో ప్రసారమైన వార్తలకు ఎంతో కృంగిపోయినట్లు తెలిపింది. అందుకు నిర్ణీత మొత్తాన్ని త్రిషకు చెల్లించాలని లాయర్ నోటీసులో పేర్కొన్నారు. 

ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అలాగే సోషల్ మీడియాలో ఏ రూపంలోనైనా త్రిషపై పరువు నష్టం కలిగేలా వార్తలు రాయడం మరియు వార్తలను ప్రదర్శించడం తక్షణమే నిలిపివేయాలని కూడా ఆ నోటీసులో వెల్లడించారు. 

Also Read : త్రిషపై అన్నాడీఎంకే లీడర్ చీప్ కామెంట్స్..ఛీ వింటేనే చిరాకేస్తుంది

అంతేకాకుండా..ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా మొదలైన వాటిలో త్రిషపై చేసిన పరువు నష్టం కలిగించే ప్రకటనలు, ఆరోపణలకు సంబంధించిన అన్ని రికార్డులను వెంటనే తన స్వంత ఖర్చుతో తొలగించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని నోటీసులో తెలిపారు.  

ప్రస్తుతం కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయాలలో కూడా ఈ న్యూస్ హాట్ టాపిక్ లా మారింది. అయితే త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏవీ రాజు ఈ విషయం మీద ఎలా స్పందించబోతున్నారు? త్రిష లీగల్ నోటీసులకు ఆయన ఎలాంటి సమాధానమిస్తారు? అనేది చర్చనీయాంశమైంది. ఒకవేళ నాలుగు రోజులలో ఏవీ రాజు సమాధానం ఇవ్వకపోతే త్రిష లీగల్ టీం ఎలా ముందుకు వెళుతుంది అనేది ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. 

ఇకపోతే ఈ అంశం మీద త్రిషకు మద్దతు తెలుపుతూ స్టార్ హీరో విశాల్ (Vishal) కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శిగా తన X ఖాతాలో స్పందిస్తూ అన్నాడీఎంకే మాజీ నేతను ఏకిపారేశాడు.' ఒక రాజకీయ పార్టీకి చెందిన ఒక తెలివితక్కువ ఇడియట్ మా సినీ సోదరుల గురించి చాలా అసహ్యంగా మాట్లాడాడని నా దృష్టికి వచ్చింది.మానవుడిగా, మీరు భూమిపై ఉన్నంత వరకు (ఎప్పటికీ ఉండలేరు)..అయితే సెలబ్రిటీల గురించి ఇలాంటి నెగిటివ్ ప్రచారం చేసి డబ్బు సంపాదించే ప్రయత్నం ట్రెండ్‌గా మారింది. ఉద్యోగం పొందండి, మంచి ఉద్యోగం పొందండి. కనీసం ప్రాథమిక క్రమశిక్షణ అయినా నేర్చుకోవడానికి మీరు బిచ్చగాడిగా వృత్తిని ప్రారంభించవచ్చు'' అని విశాల్ తనదైన రీతిలో రాసుకొచ్చారు.