తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతం అయ్యింది దళపతి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ వేడుకలో విజయ్‌కు అభిమానులు, టీవీకే (TVK) కార్యకర్తలు నీరాజనాలు పలికారు. ఆ ప్రాంతమంతా జై విజయ్ నినాదాలతో హోరెత్తిపోతోంది.
ముఖ్యంగా ఈ వేడుకలో సినీ నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన చిరకాల మిత్రుడు, సహనటుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న ఈ తరుణంలో ఆమె హాజరుకావడం అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపింది.
విజయ్‌తో పాటు మరో తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ఏడుగురు టీవీకే పార్టీకి చెందిన వారు కాగా ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ మంత్రివర్గంలో ఎస్. కీర్తన ఒక మహిళకు కూడా చోటు దక్కింది.
మంత్రులు వీళ్లే
- ఎన్. ఆనంద్
- ఆదవ అర్జున
- కె.ఎ. సెంగోటియన్
- ఎస్. కీర్తన
- కె.జి. అరుణ్ రాజ్
- పి. వెంకటరమణన్
- సి.ఆర్. నిర్మల్ కుమార్
- రాజ్‌మోహన్
- టి.కె. ప్రభు
