
సైతాన్(Shaitan), సేవ్ ది టైగర్స్(Save the tigers) వంటి సిరీస్‌లతో ఆకట్టుకుంది నటి దేవయాని శర్మ(Deviyani Sharma). నార్త్ నుంచి సౌత్ బాట పట్టిన ఈ భామ తమిళ సినిమాల్లోనూ ఆఫర్లు అందుకుంటోంది. తనకు తమిళ సినిమాలన్నా, అక్కడి హీరోలన్నా ఎంతో ఇష్టమని చెబుతోంది. చాన్స్ ఇస్తే వారితో కలిసి నటించేందుకు సిద్ధమంటూ చెప్పుకొచ్చింది. నవీన్ చంద్ర(Naveen chandra)తో ‘భానుమతి రామకృష్ణ(Bhanumathi Ramakrishna)’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఇటీవల ఆకాశ్ పూరీ(Akash puri) ‘రొమాంటిక్(Romantic)’ మూవీలోనూ ఓ రోల్ చేసింది. ఇక దేవయానిని సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారు కూడా ఎక్కువే. గ్లామర్ షో విషయంలో ఈ బ్యూటీకి ఏమాత్రం మొహమాటం లేదని తెలుస్తోంది. మరి ఈ యంగ్ ట్యాలెంట్‌ను దర్శకులు ఎలా ఎంకరేజ్ చేస్తారో వేచి చూడాల్సిందే.