Revathi: పెళ్లి కారణంగా ఆ సినిమాలు చేయలేకపోయాను.. నటి రేవతి కామెంట్స్ వైరల్

Revathi: పెళ్లి కారణంగా ఆ సినిమాలు చేయలేకపోయాను.. నటి రేవతి కామెంట్స్ వైరల్

సీనియర్ నటి రేవతి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన సహజమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ఆమె. 90 దశకంలో వరుస సినిమాలు చేసి మెప్పించిన ఆమె మానసవీణ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. అలా.. ప్రేమ, గాయం, రాత్రి వంటి చాలా సినిమాల్లో నటించారు. ఆతరువాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. ఇటీవలే తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేశారు.. లోఫర్, సైజ్ జీరో, మేజర్ వంటి సూపర్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు ఆమె. 

అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తానూ పెళ్లి చేసుకోవడంపై షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ ప్రోగ్రాంలో ఆమె మాట్లాడుతూ.. నేను నా 17 ఏటనే నటించడం మొదలుపెట్టాను. నటిగా మూడేళ్లు చేశాక 20 సంవత్సరాలకే పెళ్లి చేసుకున్నాను. కాబట్టి ఒక సంవత్సరం సినిమాలు చేయలేకపోయాను. తరువాత దేవర మగన్, ఇష్కీ వాసల్ వంటి సూపర్ హిట్ సినిమాలు చేశాను. నిజానికి.. పెళ్లి చేసుకున్నాక మంచి మంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ, పెళ్ళైన కారణంగా ఆ సినిమాలను మిస్ చేసుకున్నాను. అప్పుడు అనిపించింది.. త్వరగా పెళ్లి చేసుకుని పెద్ద తప్పు చేశానని.. అంటూ చెప్పుకొచ్చారు రేవతి. ప్రస్తుతం ఆమె చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.