‘సప్త సాగరాలు దాటి’ చిత్రంతో కన్నడతో పాటు తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రుక్మిణీ వసంత్.. ‘కాంతార: ఛాప్టర్ 1’ తర్వాత మరింత బిజీగా మారింది. సౌత్, బాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస ఆఫర్స్ ఆమెను పలకరిస్తున్నాయి. తాజాగా కోలీవుడ్ నుంచి ఓ క్రేజీ ఛాన్స్ వచ్చినట్టు సమాచారం. ధనుష్ హీరోగా నటించబోతున్న కొత్త సినిమాలో రుక్మిణీ వసంత్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
‘లబ్బర్ పందు’ ఫేమ్ తమిళసన్ పచ్చముత్తు దర్శకత్వంలో ధనుష్ ఓ సినిమా చేయబోతున్నాడు. డాన్ పిక్చర్స్‌తో కలిసి ధనుష్ నిర్మించబోతున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందించబోతున్నాడు. ఇప్పటికే శివ కార్తికేయన్ సినిమా ‘మదరాసి’తో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రుక్మిణీకి కోలీవుడ్‌లో ఇది మరో ఛాన్స్. త్వరలోనే అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేయనున్నారు.
