అదానీ పోర్ట్స్ లో స్విస్ కంపెనీ పెట్టుబడి

అదానీ పోర్ట్స్ లో స్విస్ కంపెనీ పెట్టుబడి
  • డీల్​ విలువ రూ.11,662 కోట్లు

న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాయాన సంస్థ, స్విట్జర్లాండ్​కు చెందిన ఎంఎస్​సీ కేరళలోని విజింజమ్​ పోర్ట్ లో 49 శాతం వాటాను రూ.11,662 కోట్ల విలువతో కొనుగోలు చేస్తోంది. ఈ వాటాను ఎంఎస్​సీ తన అనుబంధ సంస్థ టెర్మినల్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ లిమిటెడ్ ద్వారా దక్కించుకుంది. భారతీయ నౌకాశ్రయ మౌలిక సదుపాయాల్లో జరిగిన అతిపెద్ద విదేశీ ప్రైవేట్ పెట్టుబడి ఇదేనని అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీసెజ్) తెలిపింది. విజింజమ్​ పోర్ట్ సామర్థ్యం ప్రస్తుతం 1.6 మిలియన్ల ట్వంటీ ఫూట్ ఈక్వివలెంట్ యూనిట్లు (టీఈయూలు)  ఉంది. ఇది 2028 డిసెంబర్ నాటికి 5.7 మిలియన్ టీఈయూలకు పెరగనుంది. ఈ ఒప్పందం అదానీ పోర్ట్స్ కు సరుకు రవాణా పరిమాణాన్ని  పెంచడంలోనూ, తూర్పు ఆఫ్రికా వాణిజ్య మార్గాల్లో పట్టు సాధించడంలోనూ సహాయపడుతుంది.