ఆర్సీబీ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనేస్తా: అదర్ పూనావాలా

ఆర్సీబీ టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కొనేస్తా:  అదర్ పూనావాలా

బెంగళూరు: ఐపీఎల్ డిఫెండింగ్ చాంప్  రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు యాజమాన్య మార్పు ప్రక్రియ ఊపందుకుంది. ఈ ఫ్రాంచైజీని దక్కించుకోవడానికి సీరమ్ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలా సిద్ధమయ్యారు. 

తాను అత్యంత పటిష్టమైన బిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దాఖలు చేయబోతున్నట్లు గురువారం అధికారికంగా ప్రకటించడంతో ఈ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఆర్సీబీ విలువ సుమారు 2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.17,500 కోట్లు) ఉంటుందని అంచనా. పూనావాలాతో పాటు ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ హోంబాలే ఫిల్మ్స్ కూడా ఈ రేసులో ఉన్నట్లు సమాచారం.  మార్చి 26 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ లోపే ఆర్సీబీ యాజమాన్య బదిలీ ప్రక్రియ పూర్తయ్యే చాన్సుంది.