తెలంగాణ మార్కెట్లోకి ఏడీబీ మాస్ట్రో ప్రొడక్టులు.. మూడు ప్రీమియం విస్కీలు లాంచ్

తెలంగాణ మార్కెట్లోకి ఏడీబీ మాస్ట్రో ప్రొడక్టులు.. మూడు ప్రీమియం విస్కీలు లాంచ్

హైదరాబాద్, వెలుగు: అలైడ్ బ్లెండర్స్ డిస్ట్రిలర్స్ లిమిటెడ్ లగ్జరీ విభాగం ఏబీడీ మాస్ట్రో ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణ మార్కెట్లోకి మూడు సూపర్ ప్రీమియం విస్కీలను విడుదల చేసింది. బాలీవుడ్ నటుడు రణ్‌‌వీర్ సింగ్ సహ భాగస్వామిగా ఉన్న ఈ సంస్థ ఐరిష్ విస్కీ ఏఓడీహెచ్, ఇండియన్ విస్కీ ఉడ్‌‌బర్న్స్, డిజైనర్ విస్కీ ఎల్లో బ్రాండ్లను హైదరాబాద్‌‌లో ప్రవేశపెట్టింది. 

అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్న ఉడ్‌‌బర్న్స్ విస్కీతో పాటు స్కాచ్, ఇండియన్ మాల్ట్స్ కలయికతో ఎల్లో విస్కీని తయారు చేశారు. హైదరాబాద్‌‌తో పాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ నగరాల్లో ప్రీమియం మద్యానికి పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ఎండీ బిక్రమ్ బసు తెలిపారు. ధరలు రూ.2,630 నుంచి రూ.3,470 వరకు ఉంటాయని పేర్కొన్నారు.