హైదరాబాద్, వెలుగు: అంతర్జాతీయ పత్రికలు ఎఫ్ జైన్, ది పీక్, ఎఫ్ జైన్ సింగపూర్‌ను భారత మార్కెట్లోకి తీసుకురావడానికి అశ్రయు మీడియా, సింగపూర్‌లోని అతిపెద్ద మీడియా నెట్‌వర్క్ ఎస్పీహెచ్ మీడియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇవి ఇండియా వెలుపల విస్తరించడం ఇదే మొదటిసారి.
ఈ భాగస్వామ్యం ద్వారా ఆగ్నేయాసియా సంస్కృతి, ఫ్యాషన్, లగ్జరీ జీవనశైలిని భారతీయ పాఠకులకు పరిచయం చేస్తామని అశ్రయు మీడియా చైర్మన్ సుధాకర్ చెప్పారు. ఈ బ్రాండ్లను డిజిటల్, ప్రింట్ మీడియం ద్వారా విస్తరిస్తామని చెప్పారు. ఎఫ్ జైన్ పత్రిక గత ఐదు దశాబ్దాలుగా యువత సంస్కృతి, ఫ్యాషన్ అంశాలపై కథనాలు ఇస్తోంది. పీక్ పత్రిక బిజినెస్ లైఫ్‌స్టైల్, లీడర్‌షిప్ కథనాలను అందిస్తూ ఆదరణ పొందింది.
