కేటీఆర్.. నీకెందుకు అంత అహం? : అద్దంకి దయాకర్

కేటీఆర్.. నీకెందుకు అంత అహం? : అద్దంకి దయాకర్
  • ఆవారా, బజారుగాళ్ల కంటే ఎక్కువ మాట్లాడుతున్నవ్: అద్దంకి దయాకర్​ 

హైదరాబాద్, వెలుగు: ‘కేటీఆర్.. చిల్లర, ఆవా రా, బజారుగాళ్ల కంటే ఎక్కువ మాట్లాడుతున్నవ్.. నీ వల్ల మీ అయ్య ఎక్కడికిపోయాడో చూడు’ అని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. అయ్య పేరు చెప్పుకొని బ‌‌తికేటోడివి నీకెందుకు అంత అహం? అని సోమవారం ఒక ప్రకటనలో నిలదీశారు. ‘‘అయ్య సంపాదించిన డ‌‌బ్బుల‌‌తో లంగా, ల‌‌ఫూట్ మాట‌‌లు మాట్లాడుతున్నవ్. నీకసలు త‌‌ల‌‌కాయ ఉందా.. న‌‌వ్వో పెద్ద పుడింగిలా మాట్లాడుతున్నవ్. 

తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌‌‌‌ను వెన‌‌క్కి లాగింది నువ్వే.. ఫోన్ ట్యాపింగ్‌‌లు, దొంగ ప‌‌నులు చేసుకుంటూ బ‌‌తుకుతున్నవ్.. పిచ్చి న‌‌క‌‌రాలు చేయొద్దు.. ఇలాంటి మాట‌‌లు మాట్లాడితే ఊరుకోరు జాగ్ర త్త. సిగ్గుమాలిన ప‌‌నులు చేసి.. ఇంకా నాయ‌‌కుడిని అని తిరుగుతున్నావు. 

నీ పార్టీని ప్రజ‌‌లు పాతిపెడ్తరు. తెలంగాణ‌‌కు ప‌‌ట్టిన శ‌‌ని మీరు.. మిమల్ని తిట్టడానికి మాకు నోరు రావ‌‌డం లేదు. తెలంగాణ మీ జాగీరా.. తోడ‌‌క‌‌లు తీస్తరు. మా సీఎం నిన్ను, నీ అయ్యను ప‌‌ట్టించుకోవ‌‌డం లేదు.. నీ పార్టీని నువ్వే చంపుకుంటున్నవు అని మేం వ‌‌దిలేశాం”అని ఫైర్ అయ్యారు.