- విప్ అద్దంకి దయాకర్ కామెంట్
హైదరాబాద్, వెలుగు: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎంత కొట్టుకున్నా తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్, బీజేపీని నమ్మే పరిస్థితుల్లో లేరని విప్ అద్దంకి దయాకర్ గురువారం ఒక ప్రకటనలో అన్నారు. జనాలను గందరగోళానికి, అయోమయానికి గురిచేసేందుకే ఆ ఇద్దరూ కలిసి నాటకం ఆడుతున్నారని దుయ్యబట్టారు.
తెలంగాణలో దాడుల సంస్కృతి మంచిది కాదని, వీటిని ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. కాంగ్రెస్ సర్కారు ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తుందని, లా అండ్ ఆర్డర్ అదుపులోనే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
