హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో అటవీశాఖ అధికారుల బదిలీలు జరిగాయి. ఒకేసారి 15 మంది ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నంబర్ 932 ద్వారా ఏడుగురు అధికారులను, జీవో నంబర్ 925 ద్వారా మరో 8 మంది అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న వీఎస్ఎన్వీ ప్రసాద్‌ను హైదరాబాద్‌లోని అరణ్య భవన్లో కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ (ప్లానింగ్ అండ్ విజిలెన్స్)గా నియమించారు.
మహబూబ్‌నగర్ డీఎఫ్‌వోగా ఉన్న శివ్ ఆశిష్ సింగ్‌ను రంగారెడ్డి జిల్లా అటవీ అధికారిగా బదిలీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం డీఎఫ్‌వో జి. కిష్ట గౌడ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు బదిలీ అయ్యారు. నిజామాబాద్ డీఎఫ్‌వో సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీ అధికారిగా నియమితులయ్యారు. జయశంకర్ భూపాలపల్లి డీఎఫ్‌వోగా ఉన్న నవీన్ రెడ్డిని మహబూబ్‌నగర్ జిల్లాకు పంపారు.
ఆదిలాబాద్ డీఎఫ్‌వో ప్రశాంత్ బాజీరావు పాటిల్ నిజామాబాద్ జిల్లా అటవీ అధికారిగా బదిలీ అయ్యారు. ఆదిలాబాద్ ఫారెస్ట్ డివిజనల్ ఆఫీసర్‌గా ఉన్న చిన్న విశ్వనాథ్ భూసారెడ్డికి ఆదిలాబాద్ జిల్లా డీఎఫ్‌వోగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా భూక్యా లావణ్య హన్మకొండ, జనగామ డీఎఫ్‌వో నుంచి మహబూబాబాద్‌కు బదిలీ అయ్యారు.
విశాల్ బట్టుల మహబూబాబాద్ నుంచి వికారాబాద్ డీఎఫ్‌వోగా, ఎస్.రాజశేఖర్ పదోన్నతిపై నల్గొండ జిల్లా అటవీ అధికారిగా నియమితులయ్యారు. జి.ముకుంద రెడ్డి హన్మకొండ, జనగామ డీఎఫ్‌వోగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎం. జోజి మెదక్ జిల్లా డీఎఫ్‌వోగా కొనసాగనున్నారు. వీరితో పాటు ఎ. నరసింహారెడ్డి, డి. సంహిత, జి.బి. రేఖ భానులకు పదోన్నతులు కల్పిస్తూ ఆయా విభాగాల్లో పోస్టింగ్స్ ఇచ్చారు. బదిలీ అయిన అధికారులందరూ తక్షణమే విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది.
