పద్మారావునగర్, వెలుగు: పాటిగడ్డ–రసూల్‌పుర జంక్షన్ ఫ్లైఓవర్ రూట్ మ్యాప్‌లో మార్పులు చేయడం హర్షణీయమని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ సనత్‌నగర్ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ కోట నీలిమ అన్నారు. సోమవారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్‌ను కలిసి, కృతజ్ఞతలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. పాత ప్రతిపాదన వల్ల దాదాపు 40 ఇండ్లు, వందలాది కుటుంబాలతోపాటు వారసత్వ, చారిత్రక కట్టడాలు దెబ్బతినే అవకాశం ఉందని అధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు.
స్థానికులు సూచించిన ప్రత్యామ్నాయ రూట్ మ్యాప్‌ను కూడా అధికారులకు అందజేశామని తెలిపారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కమిషనర్ కర్ణన్ స్పందించి, చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు విశాల్ సూదం, మహమ్మద్ గౌస్, చిరంజీవి, ఒబైద్, సుల్తాన్, నసీర్, రఫిక్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌ఐఆర్ తీరును పరిశీలించిన కమిషనర్
హైదరాబాద్ సిటీ : నగరంలో ఎస్‌ఐఆర్ తీరును జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సోమవారం పరిశీలించారు. గోషామహల్ లోని ఉస్మాన్‌షాహీ, గౌలిగూడ తదితర ప్రాంతాలకు వెళ్లిన ఆయన ఎలక్టోరల్ రిజిస్టేషన్ ఆఫీసర్(ఈఆర్‌వో), అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్టేషన్ ఆఫీసర్ల(ఏఈఆర్‌వోలు)ను వివరాలడిగి తెలుసుకున్నారు.
