వ్యవసాయ రంగంలో గణనీయమైన అభివృద్ధి : అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి

వ్యవసాయ రంగంలో గణనీయమైన అభివృద్ధి :  అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి

హైదరాబాద్‌‌, వెలుగు: తెలంగాణ ఆవిర్భావం తర్వాత వ్యవసాయ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించామని అగ్రికల్చర్ డైరెక్టర్ గోపి తెలిపారు. శనివారం అగ్రికల్చర్ డైరెక్టరేట్‌‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గోపి మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతికతను వ్యవసాయంతో అనుసంధానిస్తూ పెట్టుబడి ఖర్చులు తగ్గించడం, ఉత్పాదకత పెంచడం, రైతుల ఆదాయం మెరుగుపర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపడుతోందన్నారు. 

రైతులకు పారదర్శకంగా యూరియా పంపిణీ చేసేందుకు తెలంగాణలో ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ యాప్ దేశవ్యాప్తంగా అమలవుతుండడం రాష్ట్రానికి, వ్యవసాయ శాఖకు గర్వకారణమన్నారు. రైతులు శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ ఆధునిక సాగు పద్ధతులను అవలంబించాలని సూచించారు. వాతావరణ మార్పులు, ఎల్‌‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రైతులకు ముందస్తు అవగాహన కల్పించడంలో వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేశారని అభినందించారు. 

మరిన్ని వార్తలు